Header Banner

పదవులు రాలేదని ఆందోళన అవసరం లేదు.. కష్టపడిన వారికి గ్యారెంటీ! లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

  Mon Mar 10, 2025 14:16        Politics

మంత్రి నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో చిట్‍చాట్ చేశారు. ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని, టీడీపీకి బలహీన వర్గాలపై ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటామని తెలిపారు. యువ మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావించి గ్రీష్మకు అవకాశం కల్పించామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని, పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. టీచర్ల సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించామని, అంగన్‌వాడీలకు సంబంధించిన నాలుగు ప్రధాన సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. మల్లవల్లిలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నట్లు చెప్పారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను వాటాలు అడిగారని, పారిశ్రామికవేత్తల కథనం ప్రకారం 50% వాటా కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4500 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పటి ప్రభుత్వం చిక్కీ, గుడ్డు, విద్యార్థుల కిట్లలో రూ.1000 కోట్లు ఆదా చేసిందని వివరించారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో జల్లెడపట్టి ఉత్తములను ఎంపిక చేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం నియమించిన వీసీలే కేంద్ర ప్రభుత్వానికి నచ్చాయని, వాళ్లను కేంద్రం కూడా తీసుకుంటోందని తెలిపారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు శిక్షణ అవసరమని, ప్రజలకు ఏం చేయాలో, క్యాడర్‌తో ఎలా ఉండాలో కొందరికి తెలియడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 
80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Naralokesh #mlc #positions #todaynews #flashnews #latestnews